Friday, November 19, 2010


ఆ కాలం పరిస్థితులను బట్టి చూస్తే వేమన గొప్ప హేతువాడి అని గ్రహింపవచ్చును. సమాజంలో ఎంతో దృఢంగా పాతుకుపోయిన ఆచారాలను, భావాలను అంత నిశితంగా ఎత్తిచూపడానికి చాలా ఆత్మస్థైర్యం, అవగాహన కావాలి.

ఇతరుల సొమ్ముకు ఆశించే లక్షణం "వెన్నదొంగ"లోనూ కనిపిస్తింది.
పాలకడలిపైన పవ్వళించినవాడు
గొల్ల ఇండ్ల పాలు కోరనేల?
ఎదుటివారి సొమ్ము ఎల్ల వారికి తీపి ... విశ్వ.
బంగారు లేడి ఉండదని తెలియని రాముడు దేవుడెలాగయ్యాడు?
కనక మృగము భువిని కద్దులేదనకుండ
తరుణి విడిచిపోయె దాశరధియు
తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా? ...విశ్వ.
విగ్రహారాధనను విమర్శిస్తూ
పలుగురాళ్ళు దెచ్చి పరగ గుడులు కట్టి
చెలగి శిలల సేవ జేయనేల?
శిలల సేవ జేయ ఫలమేమికలుగురా? ..విశ్వ.
కులవిచక్షణలోని డొల్లతనం గురించి
మాలవానినంటి మరినీట మునిగితే
కాటికేగునపుడు కాల్చు మాల
అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో? .. విశ్వ.

[మార్చు]విజ్ఞానం

[మార్చు]వేమన పద్యాలు మరికొన్ని

.
ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.

అనువుగానిచోట అధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ.

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు ఇంతింతగాదయా
విశ్వరాభిరామ వినురవేమ.


నిక్కమైన నీలమొక్కటైన చాలు
తళుకు వెళుకు రాలు తట్టెడేల?
చాటు పద్యమిలను చాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినురవేమ

ఎలుక తోలు తెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపె కాని తెలుపు గాదు
కొయ్యబొమ్మ దెచ్ఛి కొట్టినా బలుకునా
విశ్వదాభిరామ వినురవేమ
 

No comments: